Published on Dec 8, 2024 2:55 PM IST
మంచు మోహన్ బాబు కుటుంబం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. మంచు మోహన్ బాబు తన పై, తన భార్యపై దాడిచేశారని స్వయంగా ఆయన కొడుకు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. పైగా మనోజ్ గాయాలతోనే పోలీస స్టేషన్ కు వెళ్లి మరీ మోహన్ బాబుపై ఫిర్యాదు చేశాడని ఆ వార్తల సారాంశం. మొత్తానికి మోహన్ బాబుపై పహడి షర్రిఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని టాక్.
ఐతే, ఈ వార్తల పై మోహన్ బాబు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘దయచేసి అసత్యాలను ప్రచారం చేయకండి. మోహన్ బాబు , మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కొన్ని ఊహాజనితమైన కధనాలను కొన్ని మీడియా చానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. ఎవిడెన్స్ లు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి’ అంటూ మోహన్ బాబు ఈ వార్తలను ఖండించారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది చూడాలి.