మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ రీసెంట్గా ‘లక్కీ భాస్కర్’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయగా ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ వసూళ్లు అందుకుంటోంది.
ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్లో లక్కీ హీరోగా మారిపోయాడు. ఆయనతో సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పుడు ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ తన నెక్స్ట్ మూవీని ఇప్పటికే లాంచ్ చేశాడు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి, భాగ్యశ్రీ కూడా నటిస్తున్నారు. అయితే, ఇప్పుడు మరో రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇందులో మొదటి సినిమాను నవంబర్ చివరినాటికి అనౌన్స్ చేసి, పట్టాలెక్కించాలని చూస్తున్నాడట. ఓ టాప్ తెలుగు డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా భారీ బడ్జెట్ మూవీగా ఇది రానున్నట్లు తెలుస్తోంది. మరి దుల్కర్ ఓకే చెప్పిన ఈ తెలుగు సినిమా ఏమిటో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
The post దుల్కర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.