Sat. Mar 28th, 2026

దీపావళి కానుకకు వారం ముందే అక్టోబర్ 10న “ఎర్రచీర – ది బిగినింగ్” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ – శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో, రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కథానాయికగా నటిస్తోంది. దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వంతో పాటు కీలకపాత్రలో కనిపించనున్నారు.

హారర్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని క్లియర్ సర్టిఫికెట్ పొందింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలైట్ అని సెన్సార్ టీమ్ ప్రశంసించింది.

సినిమా ట్రైలర్ చూసిన డైరెక్టర్ జ్యోతి కృష్ణ మాట్లాడుతూ – “ఎర్రచీర ట్రైలర్ చాలా బాగుంది. అక్టోబర్ 10న థియేటర్స్ లో తప్పక చూడాలి” అని తెలిపారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అక్టోబర్ 3న ట్రైలర్ విడుదల, అక్టోబర్ 5న విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నాయి.

The post అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమైన ఎర్రచీర – ది బిగినింగ్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.