విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై భారీ విజయం సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 14న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా, గ్లోబల్‌గా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. విజయాన్ని పురస్కరించుకుని, చిత్రబృందం హైదరాబాద్‌లో గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది.

ఈ సినిమాతో చిన్నారి నటుడు రేవంత్ భీమాల ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్ కుమారుడిగా “బుల్లిరాజు” పాత్రలో నటించిన రేవంత్, తన కామెడీ, డైలాగ్ డెలివరీ, సహజమైన అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ముఖ్యంగా బుల్లిరాజు పాత్ర ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించింది. అతని సీన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. సినిమా విడుదలైనప్పటి నుండి, రేవంత్ పేరు మారుమోగిపోతుండటంతో, అతని ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది.

అయితే, బుల్లిరాజు ఫేమస్ కావడంతో, అతని పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అసత్య ప్రచారాలు, రాజకీయ పోస్టులు పెడుతున్నారని రేవంత్ తండ్రి భి. శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. బుల్లిరాజు పేరును దుర్వినియోగం చేయడం అనైతికమని, నిజమైన అప్డేట్స్ కేవలం అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా మాత్రమే అందిస్తామన్నారు. తప్పుడు ప్రచారాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

అన్ని సోషల్ మీడియా యూజర్లకు, మీడియా వర్గాలకు విజ్ఞప్తిగా “రేవంత్ భీమాల ఏ రాజకీయ సంబంధం లేదు, దయచేసి మా అబ్బాయిని ఈ వివాదాల్లోకి లాగవద్దు” అని తెలిపారు. సినిమా విజయంతో రేవంత్ భీమాల మరింత పాపులర్ అవుతుండగా, అతని ఫ్యాన్స్ ఈ పరిస్థితిని అర్థం చేసుకుని, నిజమైన సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని సూచిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *