విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “ఫ్యామిలీ స్టార్” సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతోంది. ముందు పాన్ ఇండియా రిలీజ్ అనుకున్నా ఏప్రిల్ 5న తెలుగు, తమిళంలోనే రిలీజ్ చేస్తున్నారు. రెండు వారాల తర్వాత మిగతా భాషల్లో విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు. రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుండటంతో ప్రమోషన్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు మూవీ టీమ్ రెడీ అవుతోంది. ఇవాళ ఫ్యామిలీ స్టార్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు.

స్టూడెంట్స్ మధ్య ప్రీ రిలీజ్ చేస్తే సందడిగా ఉంటుందని ఫ్యామిలీ స్టార్ టీమ్ నిర్ణయించింది. అందుకే దూలపల్లి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో ఈ సాయంత్రం 5.30 గంటల నుంచి ఘనంగా ఈ ప్రీ రిలీజ్ వేడుకల్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్, డైరెక్టర్ పరశురామ్, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తో పాటు ఇతర టీమ్ మెంబర్స్ పాల్గొనబోతున్నారు. ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ లో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ పాల్గొనే అవకాశం ఉంది.