అల్లు అర్జున్ కోసం అభిమాని సైకిల్ రైడ్.. ఏకంగా 1600 కిలోమీటర్లు.! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 16, 2024 5:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-ది రైజ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ సంపాదించాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఆయన నటనకు ఏకంగా జాతీయ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా దక్కింది. ఇక ఆయనకు ఆ సినిమాతో ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆయన కోసం అభిమానులు ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు.

తాజాగా ఓ అభిమాని చేసిన పని నెట్టింట తెగ హల్‌చల్ అవుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘడ్‌లోని ఓ అల్లు అర్జున్ ఫ్యాన్, ఆయన్ను కలిసేందుకు ఏకంగా హైదరాబాద్‌కు సైకిల్‌పై 1600 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. తన అభిమాన నటుడిని కలుసుకునేందుకు తాను చేసి ఈ పని ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఇక ఆ అభిమాని గురించి తెలుసుకున్న అల్లు అర్జున్, అతడిని కలుసుకుని మాట్లాడాడు. తాను తిరిగి ఇంటికి చేరేందుకు ఏర్పాట్లు కూడా చేయమని అల్లు అర్జున్ తన సిబ్బందికి సూచించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇలా తన అభిమానిని బన్నీ పలకరించిన తీరు, అతడికి కష్టం రాకుండా ఆయన చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. తమ అభిమాన నటుడు నిజంగానే గ్రేట్ అంటూ వారు బన్నీని ప్రశంసలతో కొనియాడుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *