Published on Dec 16, 2024 7:57 PM IST
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10, 2025న థియేటర్లలోకి రానుంది. ఐతే, ఈ పొలిటికల్ డ్రామా పై మెగా ఫ్యాన్స్ లో ఓ చర్చ మొదలైంది. కల్కి, దేవర, పుష్ప 2 సినిమాలకు ఓపెనింగ్ డే అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. మరి గేమ్ ఛేంజర్ కి ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి ?, పైగా గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతికి రాబోతుంది. సంక్రాంతికి సహజంగానే సినిమాలకు కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి.
ఆ రకంగా చూసుకుంటే గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉండాలి ? ఇదే చర్చ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో నడుస్తోంది. ఎలాగూ టికెట్ రేటు 800 లేదా వెయ్యి రూపాయల ఉండొచ్చు. కాకపోతే, ప్రీమియర్లు ఎన్ని పడతాయి ?, అలాగే, తొలి రెండు రోజులు రేట్లు ఎంత మేరకు పెంచుకుంటారు ? వంటి అంశాలు పై కలెక్షన్స్ ఆధారపడి ఉన్నాయి. ఏది ఏమైనా మెగా అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
పైగా ఈ సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో అంజలి కనిపించనుంది. అన్నట్టు గేమ్ ఛేంజర్ నార్త్ ఇండియా థియేటర్స్ రైట్స్ ను అనిల్ తడాని యొక్క AA ఫిల్మ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.