Daaku Maharaj : డాకూ మహారాజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం.. భారీగా తరలి వచ్చిన అభిమానులు

  • డల్లాస్ లో అట్టహాసంగా డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
    భారీగా తరలివచ్చిన అభిమానులు
    సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్న అభిమానులు

Daaku Maharaj : వరుస భారీ విజయాలతో దూసుకెళుతున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకి అందరూ ఫిదా అయ్యారు. ఇటీవల రిలీజ్ అయిన దాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్ కు ప్రశంసలు అందుకోవడమే కాకుండా అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్, ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు నిర్మాత నాగవంశీ. ఈ రోజు అమెరికాలోని డల్లాస్, టెక్సాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

Read Also:Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు అలర్ట్.. స్పర్శదర్శనంలో మార్పులు..

ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు మేకర్స్. డాకు మహారాజ్ ఈవెంట్ ను ఎన్నడూ చూడని విధంగా ఎవరు చూడని విధంగా ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత నాగ వంశీ. తన అభిమాన హీరో ఫంక్షన్ ను అందరూ చాలా కాలం మాట్లాడుకునేలా గ్రాండ్ గా చేయాలని నాగవంశీ ప్లాన్ చేశారు. ఓవర్సీస్ లో ఈ సినిమాను శ్లోక ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తోంది. బాలయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తొలిసారి అమెరికాలో జరుగుతుండడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈవెంట్ కు భారీగా అభిమానగణం తరలి వచ్చింది. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జరుగనుంది.

Read Also:Chennai: గవర్నర్‌ రవిని కలిసిన బీజేపీ మహిళలు.. అన్నా వర్సిటీ కేసులో న్యాయం చేయాలని వినతి

ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే డాకు మహారాజ్ కి పోటీగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వస్తున్నాయి. ఈ మూడు సినిమాలు డిఫరెంట్ జోనర్స్ లో వస్తుండడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *