Fauji : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఫౌజీ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను రెండో ప్రపంచ నేపథ్యంలో తీస్తున్నారు. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ ఆఫీసర్ గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రేమ, ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడంలో హను స్టైలే వేరు. కాబట్టి ఆయన ఈ సినిమాను వేరే రేంజ్ లో తీస్తారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి కొన్ని రూమర్లు వస్తున్నాయి.
Learn Additionally : Allu Sneha : బర్త్ డే నైట్ ఇద్దరమే అంటూ అల్లు స్నేహ పోస్ట్..
ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తి అయిందని చెబుతున్నారు. ప్రభాస్ ఇంకో 35 రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసేస్తారని 2026 ఆగస్టు 15 రిలీజ్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. కానీ రిలీజ్ డేట్ ఇప్పట్లో ఉండే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ మూవీ షూటింగ్ చాలా రోజులుగా ఆగిపోయింది. పైగా పాకిస్థాన్, భారత్ యుద్ధం నేపథ్యంలో ఇమాన్వి షూటింగ్ లో పాల్గొనలేదు. అలా కూడా చాలా లేట్ అయిపోయింది. పైగా ప్రభాస్ త్వరలోనే స్పిరిట్ సినిమా షూట్ లో పాల్గొనబోతున్నాడు. ఆ మూవీ తర్వాత కల్కి-2 కూడా స్టార్ట్ అవుతుంది. పైగా రాజాసాబ్ షూట్ లో ప్రభాస్ చాలా బిజీగా ఉంటున్నాడు. ఆ సినిమాకే బల్క్ గా డేట్స్ ఇచ్చేశాడు. కాబట్టి ఫౌజీ ఆ కరెక్ట్ డేట్ కు వస్తుందనే నమ్మకం లేదు.
Learn Additionally : Srikanth Bharat : క్షమాపణలు చెప్పిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్