Fear Movie Review In Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 14, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : వేదిక, అరవింద్ కృష్ణ, పవిత్ర లోకేష్, జయప్రకాష్, అనీష్ కురువిల్ల, సాయాజీ షిండే, సాహితి దాసరి, సత్యకృష్ణ, బిగ్ బాస్ షాని తదితరులు

దర్శకుడు : హరిత గోగినేని

నిర్మాతలు : వంకి పెంచలయ్య, ఏఆర్ అభి

సంగీత దర్శకుడు : అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ : ఐ ఆండ్య్రూ

సంబంధిత లింక్స్: ట్రైలర్

వేదిక మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన తాజా మూవీ ఫియర్. డైరెక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ:

ఇందు (వేదిక), సింధు (వేదిక – ద్విపాత్రాభినయం) అనే కవలల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే, చిన్నప్పటి నుంచి సింధుకి కొన్ని భాగాలు ఉంటాయి, విపరీతంగా ఆమె భయపడుతూ ఉంటుంది. మరోవైపు ఎవరికీ కనిపించని ఓ వ్యక్తి సింధుకు మాత్రమే కనిపిస్తూ ఆమెను వెంటాడుతుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య సింధు (వేదిక) తన క్లాస్‌మేట్ సంపత్ (అరవింద్ కృష్ణ)ను ప్రేమిస్తుంది. అయితే, కొద్దిరోజులకు తన బాయ్‌ఫ్రెండ్ మిస్ అయ్యాడని అతని కోసం వెతుకుతూ ఉంటుంది. ఆమెను మెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. మెంటల్ ఆసుపత్రిలో సింధు జీవితంలో ఏం జరిగింది ?, అసలు సింధుకు మాత్రమే కనిపించే వ్యక్తి ఎవరు ?, ముఖ్యంగా సింధు తరచుగా భయపడటానికి కారణం ఏంటీ ?, అలాగే, సింధుకు మిగిలిన పాత్రలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి ?, అసలు మిగిలిన ప్రధాన పాత్రలు ఎవరు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మెయిన్ థీమ్, అలాగే క్లైమాక్స్ పర్వాలేదు. నటీనటుల విషయానికి వస్తే.. ప్రధాన పాత్రలో నటించిన వేదిక బాగానే నటించింది. సింధు – ఇందు పాత్రల్లో కనిపించిన ఆమె, కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కీలక సీన్స్ లో కూడా వేదిక మెప్పించింది.

ఈ సినిమాలో మరో కీలక పాత్రలో అరవింద్ కృష్ణ బాగానే నటించాడు. తల్లి పాత్రలో పవిత్ర లోకేష్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన జయప్రకాష్ చాలా బాగా నటించారు. అలాగే అనీష్ కురువిల్ల, సాయాజీ షిండే, సాహితి దాసరి, సత్యకృష్ణ, బిగ్ బాస్ షాని మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలతో మెప్పించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ ఫియర్ సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నప్పటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకురాలు హరిత పూర్తిగా విఫలం అయ్యారు. నిజానికి, ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ప్లే ఫుల్ ఫన్ తో సాగాలి. కానీ, ఈ సినిమా ఏ దశలోనూ అలా సాగలేదు. దీనికితోడు ఈ ఫియర్ చిత్రంలో చాలా సన్నివేశాలు చాలా పేలవంగా సాగుతాయి.

పైగా ఆ సన్నివేశాల్లో లాజిక్స్ కూడా ఎక్కడా కనిపించవు. అలాగే సింధు – ఆమె పేరెంట్స్ పాత్రల మధ్య ట్రాక్ కు కూడా సరైన బలం లేదు. నిజానికి కథనానికి అనుగుణంగా జరుగుతున్న డ్రామాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను మెయింటైన్ చేయవచ్చు. కానీ.. ఈ విషయంలోనూ సినిమా ఎఫెక్టివ్ గా లేదు. అలాగే, కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఫేక్ గా అనిపిస్తాయి.

ఐతే, దర్శకురాలు హరిత, సెకండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గానీ, అది స్క్రీన్ మీద అసలు వర్కౌట్ కాలేదు. మొత్తానికి ఒక్క క్లైమాక్స్ తప్ప సినిమాలో ఆకట్టుకునే అంశం లేకుండా పోయింది. ప్రధానంగా ప్రధాన పాత్రల డిజైన్ కూడా అసలేమీ బాగాలేదు. మొత్తానికి ఈ సినిమా నిరాశపరిచింది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ కూడా బాగానే ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ఇక ఐ ఆండ్య్రూ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటర్ గా కూడా చేసిన హరిత వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలోని నిర్మాతలు వంకి పెంచలయ్య, ఏఆర్ అభి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ ఏవరేజ్ గా ఉన్నాయి. ఇక దర్శకురాలు హరిత గోగినేని త్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేదు.

తీర్పు :

‘ఫియర్’ అంటూ వచ్చిన ఈ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ నిరాశ పరిచింది. ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా సాగడం, కథలో మేటర్ లేకపోవడం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలతో పాటు లాజిక్ లెస్ డ్రామా కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఐతే, సినిమాలో మెయిన్ థీమ్ అండ్ క్లైమాక్స్ బాగున్నాయి.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *