Telugu Bell https://telugubell.com Bell Every News Fri, 29 Nov 2024 15:30:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 రియల్ లైఫ్ ‘ఒకే ఒక్కడు’ చూపిస్తున్న పవన్.. ‘ఓజి’ కి మించిన కిక్ అంటున్న ఫాన్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/pawan-kalyan-showing-oke-okkadu-movie-in-real-life-fans-got-excited-html/ https://telugubell.com/pawan-kalyan-showing-oke-okkadu-movie-in-real-life-fans-got-excited-html/#respond Fri, 29 Nov 2024 15:30:20 +0000 https://telugubell.com/pawan-kalyan-showing-oke-okkadu-movie-in-real-life-fans-got-excited-html/

Published on Nov 29, 2024 9:00 PM IST

మన టాలీవుడ్ స్టార్ హీరో అలాగే ఏపీకి ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇపుడు ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ బిజీలో తన భారీ సినిమా “హరిహర వీరమల్లు” మళ్ళీ స్టార్ట్ చేయనుండగా ఈ చిత్రం తర్వాత “ఓజి” సినిమా మొదలు కానుంది. మరి ఉప ముఖ్యమంత్రి హోదాలో మాత్రం ఫ్యాన్స్ కి సినిమాలని మించిన కిక్ ని తాను అందిస్తున్నాడు అని ఇపుడు తన అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు.

శంకర్ సెన్సేషనల్ హిట్ చిత్రం “ఒకే ఒక్కడు” లో అర్జున్ ఏ రీతిలో అయితే సీజింగ్ లు సస్పెన్సన్ లు లెటర్స్ రాయిస్తాడో దీనిని రియల్ లైఫ్ లో పవన్ చూపిస్తున్నాడు అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మాట్లాడుతుంటున్నారు. దీనితో ఇపుడు పలు వీడియోలు గట్రా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకొందరు అయితే మన సూపర్ స్టార్ మహేష్ బాబు “భరత్ అనే నేను” ఎడిట్స్ కూడా చేస్తూ పవన్ “ఓజి” కి మించిన కిక్ అందిస్తున్నాడు అంటూ ఆ వైబ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

]]>
https://telugubell.com/pawan-kalyan-showing-oke-okkadu-movie-in-real-life-fans-got-excited-html/feed/ 0 2187
‘వార్ టైమ్’కి సిద్ధం కావాలంటోన్న సూర్య | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/nanis-saripodhaa-sanivaaram-set-for-hindi-television-premiere-html/ https://telugubell.com/nanis-saripodhaa-sanivaaram-set-for-hindi-television-premiere-html/#respond Fri, 29 Nov 2024 14:30:50 +0000 https://telugubell.com/nanis-saripodhaa-sanivaaram-set-for-hindi-television-premiere-html/

Published on Nov 29, 2024 8:00 PM IST

న్యాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ సరిపోదా శనివారం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు ఓటీటీలోనూ సాలిడ్ రెస్పాన్స్ లభించింది.

అయితే, ఇప్పుడు ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమయ్యింది. కానీ, ఈసారి హిందీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సూర్య వస్తున్నట్లు నాని అంటున్నాడు. సరిపోదా శనివారం హిందీ టెలివిజన్ ప్రీమియర్‌గా కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్‌లో టెలికాస్ట్ కానుంది. నవంబర్ 30 శనివారం రోజున ‘సూర్యాస్ శాటర్డే’ అంటూ హిందీ ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ ఇచ్చేందుకు నాని అండ్ ఎస్.జె.సూర్య రెడీ అయ్యారు.

దీంతో ఈ సినిమాను బుల్లితెరపై హిందీ ఆడియెన్స్ ఎంతమేర ఆదరిస్తారు అనేది ఇంట్రెసింగ్‌గా మారింది. ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సాలిడ్ సంగీతం అందించాడు.

]]>
https://telugubell.com/nanis-saripodhaa-sanivaaram-set-for-hindi-television-premiere-html/feed/ 0 2179
సందీప్ కిషన్‌తో జేసన్ సంజయ్ మూవీ.. సాలిడ్‌గా మోషన్ పోస్టర్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/jason-sanjay-to-debut-as-direct-with-sundeep-kishan-as-hero-html/ https://telugubell.com/jason-sanjay-to-debut-as-direct-with-sundeep-kishan-as-hero-html/#respond Fri, 29 Nov 2024 13:27:34 +0000 https://telugubell.com/jason-sanjay-to-debut-as-direct-with-sundeep-kishan-as-hero-html/

హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. మంచి పాత్ర ఉంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ధనుష్ తెరకెక్కించిన ‘రాయన్’ చిత్రంలో మాస్ పాత్రలో నటించిన సందీప్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశాడు ఈ యంగ్ హీరో. ఆయన తన నెక్స్ట్ చిత్రాన్ని తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

ఈమేరకు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను ఇచ్చారు. దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సందీప్ కిషన్‌ను తన హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు జేసన్ సంజయ్. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఈ చిత్ర అనౌన్స్‌మెంట్‌ను మోషన్ పోస్టర్‌గా రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్‌కు థమన్ ఇచ్చిన బీజీఎం రాకింగ్‌గా ఉంది.

మొత్తానికి సందీప్ కిషన్‌తో జేసన్ సంజయ్ ఏదో గట్లిగానే ప్లాన్ చేశాడని ఈ మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. మరి ఈ సినిమాను ఎలాంటి కథతో తెరకెక్కించనున్నారు, ఈ సినిమాలో మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ ఎవరనేది తెలియాల్సి ఉంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The post సందీప్ కిషన్‌తో జేసన్ సంజయ్ మూవీ.. సాలిడ్‌గా మోషన్ పోస్టర్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

]]>
https://telugubell.com/jason-sanjay-to-debut-as-direct-with-sundeep-kishan-as-hero-html/feed/ 0 2173
విషాదం.. స్టార్ హీరోయిన్ సమంత తండ్రి కన్నుమూత | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/samantha-father-joseph-prabhu-passed-away-html/ https://telugubell.com/samantha-father-joseph-prabhu-passed-away-html/#respond Fri, 29 Nov 2024 12:36:52 +0000 https://telugubell.com/samantha-father-joseph-prabhu-passed-away-html/

Published on Nov 29, 2024 6:06 PM IST

స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు హఠాన్మరణం పొందారు. ఈ వార్తను సమంత తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ‘మళ్లీ మనం కలుసుకునే వరకు డాడ్’ అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజీని సమంత పోస్ట్ చేసింది.

అయితే, జోసెఫ్ ప్రభు మరణానికి గుండెపోటు కారణమని తెలుస్తోంది. ఆయన నిద్రలో ఉండగానే గుండెపోటుకు గురై మృతి చెందినట్లుగా తెలుస్తోంది. భార్యతో జోసెఫ్ ప్రభు చెన్నైలో జీవిస్తున్నారు. ఈ వార్తతో చిత్ర వర్గాల్లో విషాదం నెలకొంది. సమంతకు ఆమె తండ్రి అంటే ఎంతో ప్రేమ అని.. ఆమె తన కెరీర్‌లో పైకి రావడానికి తన తండ్రి ఎంతగానో కృషి చేశాడని సమంత పలుమార్లు తెలిపింది.

సమంత తండ్రి మరణవార్త గురించి తెలుసుకున్న పలువురు ఆమెకు తమ సంతాపం తెలుపుతున్నారు. సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆమెకు ధైర్యాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

]]>
https://telugubell.com/samantha-father-joseph-prabhu-passed-away-html/feed/ 0 2171
Poll : Which melody song impressed you the most in recent times? | Latest Telugu Movie Videos https://telugubell.com/poll-which-melody-song-impressed-you-the-most-in-recent-times-html/ https://telugubell.com/poll-which-melody-song-impressed-you-the-most-in-recent-times-html/#respond Fri, 29 Nov 2024 12:33:41 +0000 https://telugubell.com/poll-which-melody-song-impressed-you-the-most-in-recent-times-html/ పోల్ : ఇటీవలి కాలంలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న మెలోడీ పాట ఏది?

]]>
https://telugubell.com/poll-which-melody-song-impressed-you-the-most-in-recent-times-html/feed/ 0 2169
‘మాస్’ ఎమోషనల్ మ్యూజిక్ తో లాక్ అయ్యిపోయిన నాగ్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/nagarjuna-locks-for-his-mass-movie-emotional-music-in-bigg-boss-8-html/ https://telugubell.com/nagarjuna-locks-for-his-mass-movie-emotional-music-in-bigg-boss-8-html/#respond Fri, 29 Nov 2024 11:30:20 +0000 https://telugubell.com/nagarjuna-locks-for-his-mass-movie-emotional-music-in-bigg-boss-8-html/

Published on Nov 29, 2024 5:00 PM IST

మన టాలీవుడ్ ఎవర్ చార్మింగ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఇపుడు పలు చిత్రాలతో పాటుగా తెలుగు సెన్సేషనల్ రియాలిటీ షో బిగ్ బాస్ ని కూడా హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఒక ఫుల్ టైట్ షెడ్యూల్ లో కింగ్ నాగ్ వెళ్తుండగా ఇపుడు నాగ్ పై ఓ ఫన్నీ వీడియో వైరల్ గా మారింది అని చెప్పాలి. బిగ్ బాస్ షోలో హోస్ట్ చేసేందుకు తన అసిస్టెంట్ తో కాస్ట్యూమ్ విషయంలో నాగ్ వాదిస్తూ ఇందులో కనిపిస్తున్నారు.

తాను ఒక రంగు దుస్తులు చెప్తే ఆమె ఏమో ఇంకో రంగు చెబుతుంది. దీనితో ఆమె మాస్ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఎమోషనల్ వైలెన్ ట్రాక్ వినిపించి ఆమె చెప్పిందే ఓకే చేయించుకుంటుంది. దీనితో అలా తన మ్యూజిక్ దెబ్బకి తానుగా నాగ్ లాక్ అయ్యారని చెప్పాలి. మరి సోషల్ మీడియాలో ఈ మ్యూజిక్ ట్రాక్ తో ఎన్నో రీల్స్ ఈ మధ్యలో వచ్చాయి. నార్త్ ఆడియెన్స్ లో మరీనూ అని చెప్పాలి. మొత్తానికి మళ్ళీ స్వయంగా నాగ్ రీక్రియెట్ చేయడం అనేది ఫ్యాన్స్ లో ఒక కొత్త రకమైన సంతోషాన్ని నింపింది అని చెప్పాలి .

]]>
https://telugubell.com/nagarjuna-locks-for-his-mass-movie-emotional-music-in-bigg-boss-8-html/feed/ 0 2165
డిసెంబర్‌లో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన కీర్తి సురేష్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/keerthy-suresh-gives-clarity-on-her-wedding-html/ https://telugubell.com/keerthy-suresh-gives-clarity-on-her-wedding-html/#respond Fri, 29 Nov 2024 10:35:38 +0000 https://telugubell.com/keerthy-suresh-gives-clarity-on-her-wedding-html/

అందాల భామ కీర్తి సురేష్ దక్షిణాదిన తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. మహానటి చిత్రంతో ఏకంగా నేషనల్ అవార్డును కూడా అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ‘బేబీ జాన్’ అనే సినిమాలో వరుణ్ ధావన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి చాలా రోజులుగా పలు వార్తలు వినిపిస్తూ వచ్చాయి.

వాటిని నిజం చేస్తూ కీర్తి సురేష్ తాను ప్రేమలో ఉన్నట్లుగా రీసెంట్‌గా ప్రకటించింది ఈ బ్యూటీ. అయితే, ఇప్పుడు తన పెళ్లిపై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది కీర్తి సురేష్. తాజాగా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా డిసెంబర్‌లో తన పెళ్లి ఉందని.. అలాగే తన నెక్స్ట్ మూవీ ‘బేబీ జాన్’ రిలీజ్‌కు సిద్ధమైనందున తిరమలకు వచ్చినట్లు ఆమె తెలిపింది. అంతేగాక, తన పెళ్లి గోవాలో జరగనుందని కూడా కీర్తి సురేష్ తెలిపింది.

ఇక కీర్తి సురేష్ ఆంటోనీ తటిల్ అనే బిజినెస్‌మెన్‌ను ప్రేమ వివాహం చేసుకునేందుకు రెడీ కావడంతో అభిమానులు ఈ పెళ్లి కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

The post డిసెంబర్‌లో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన కీర్తి సురేష్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

]]>
https://telugubell.com/keerthy-suresh-gives-clarity-on-her-wedding-html/feed/ 0 2164
ఇంటర్వ్యూ : కాస్ట్యూమ్ డిజైన‌ర్ గాయ‌త్రి దేవి – ‘వికటకవి’ లాంటి సిరీస్ కి వర్క్ చేయడం మామూలు విషయం కాదు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/interview-of-vikkatakavi-costume-designer-gayathri-devi-joshyula-html/ https://telugubell.com/interview-of-vikkatakavi-costume-designer-gayathri-devi-joshyula-html/#respond Fri, 29 Nov 2024 09:32:46 +0000 https://telugubell.com/interview-of-vikkatakavi-costume-designer-gayathri-devi-joshyula-html/

ఇటీవల ఓటీటీల్లో, వెబ్ సిరీస్‌ల‌కు ప‌ని చేయటం అనేది యంగ్ టాలెంట్‌, యంగ్ టెక్నీషియ‌న్స్‌కు గుడ్ ఫ్లాట్‌ఫామ్స్‌ గా మారాయని చెప్పొచ్చు. అయితే వ‌ర్క్ ప‌రంగా ఎప్ప‌టిక‌ప్పుడు హిందీ, ఫ్రెంచ్‌, కొరియ‌న్ వంటి ప్రాజెక్ట్స్‌ను చూస్తుంటాను. బిజీగా ఉన్నామ‌ని అప్‌డేట్ కావ‌టం మానుకోలేం’’ అని అన్నారు కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి. తాజాగా ప్రముఖ ఓటీటీ చానెల్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న డిటెక్టివ్ వెట్ సిరీస్ ‘వికటకవి’ సిరీస్‌కు ఆమె వర్క్ చేశారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి వికటకవి వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ పీరియాడిక్ డిటెక్టివ్ వెబ్ సిరీస్‌లో వస్త్రాలంకారణకి కూడా మంచి పేరు వచ్చింది. మరి అలాంటి కాస్ట్యూమ్స్ అందించిన గాయత్రి దేవి ఏం చెప్పారో ఈ ఇంటర్వ్యూలో చూద్దాం.

ఈ బాక్గ్రౌండ్ కోసం చెప్పండి

నేను పుట్టింది విజ‌య‌న‌గ‌రం.. పెరిగిందంతా చెన్నై. ఇంట‌ర్ వ‌ర‌కు చెన్నైలోనే చ‌దువుకున్నాను. కంప్యూట‌ర్ సైన్స్‌లో ఇంజ‌నీరింగ్ పూర్తి చేశాను. సామ్ సంగ్‌లో జాబ్ చేశాను. త‌ర్వాత మైక్రోసాఫ్ట్‌లో జాయిన్ అయ్యాను. ఆ స‌మ‌యంలో నేను హైద‌రాబాద్ వ‌చ్చాను. ఇండియా డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌లో డెవ‌ల‌ప‌ర్‌గా వ‌ర్క్ చేశాను. మూడేళ్లు హైద‌రాబాద్‌లో వ‌ర్క్ చేసిన త‌ర్వాత కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో జాబ్‌కి రిజైన్ చేసేశాను.

మరి ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా ఎలా మారారు?

జాబ్ రిజైన్ చేసిన త‌ర్వాత బ్రేక్ తీసుకుందామ‌ని అనుకున్నాను. ఆ స‌మ‌యంలోనే ఫ్యాష‌న్ డిజైనింగ్‌లో జాయిన్ అయ్యాను. ఇంట్లో కుట్లు, అల్లిక‌లు నేర్పించ‌టం వ‌ల్ల అయితే కూడా ఫ్యాష‌న్ డిజైనింగ్ చేస్తే బిజినెస్ పెట్ట‌టానికి బావుంటుంద‌నిపించింది. న‌ల‌బై ఏళ్లు వ‌చ్చిన త‌ర్వాత బోటిక్ బిజినెస్ పెడ‌దామ‌ని అనుకుంటుండేదాన్ని. కానీ.. ఎలాగూ జాబ్ రిజైన్ చేశాం క‌దా.. ఇప్పుడు బోటిక్ బిజినెస్ పెడ‌దామ‌ని నిర్ణ‌యానికి వ‌చ్చాను. దాంతో హాంస్టెగ్‌లో ఏడాదిపాటు ఫ్యాష‌న్ డిజైనింగ్ డిప్లోమా కోర్స్ చేశాను. కోర్స్ కాగానే ఫ్యాష‌న్ షో కూడా చేశాను. ఆ త‌ర్వాత ఏడాదిలోనే న‌న్ను మెంటర్‌గా కూడా పిలిచారు… అది కూడా చేశాను. ఎంత ప్యాష‌న్ డిజైనింగ్ కోర్స్ చేసిన‌ప్ప‌టికీ ఓ గార్మెంట్ చేయాలంటే ఎగ్జిక్యూష‌న్ కూడా మాకు వ‌చ్చి ఉండాలి. ఫ్యాబ్రిక్ కొన‌టం ద‌గ్గ‌ర నుంచి వర్క్ పూర్త‌యిన దాన్ని ఎంత‌కు నేను సేల్ చేస్తాన‌నే వ‌ర‌కు నాకు తెలియాలి. అందువ‌ల్ల ఫ్యాష‌న్ షో మెంట‌ర్‌గా వ‌ర్క్ చేశాను. నా ద‌గ్గ‌ర 7 టీమ్స్ ఉండేవి. త‌ర్వాత నేనే సొంతంగా బోటిక్ బిజినెస్ స్టార్ట్ చేశాను. 2019వ‌ర‌కు బోటిక్ బిజినెస్ బాగానే వ‌ర్క్ అవుతూ వ‌చ్చింది. అయితే కోవిడ్ వ‌చ్చిన త‌ర్వాత బిజినెస్ క్లోజ్ చేసేశాను. ఇప్పుడు ఇంకా పెద్ద స్థాయిలో బిజినెస్ చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాను.

సినీ పరిశ్రమలో ఎలా అవకాశం వచ్చింది?

రెగ్యుల‌ర్‌గా ఇత‌ర డిజైన‌ర్స్ వ‌చ్చి నా ద‌గ్గ‌ర స్టిచింగ్ చేసుకుని వెళుతుండేవారు. అలా మొద‌లైన ఈ ప్ర‌యాణంతో నేను కూడా మెల్ల‌గా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాను. ప‌లాస మూవీకి నేను డిజైనింగ్ మాత్ర‌మే చేసిచ్చాను… షూట్‌కి వెళ్ల‌లేదు. అయితే ఆహా వాళ్లు చేసిన కుడిఎడ‌మైతే వెబ్ సిరీస్ ద్వారా కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా నా కెరీర్ ఇక్క‌డ స్టార్ట్ అయ్యింది. త‌ర్వాత పారాహుషార్ అనే మ‌రో సినిమాకు వ‌ర్క్ చేశాను. అయితే కొన్ని కార‌ణాల‌తో ఆ సినిమా విడుద‌ల కాలేదు. త‌ర్వాత క‌రుణ‌కుమార్‌గారు రూపొందించిన క‌ళాపురం సినిమాకు వ‌ర్క్‌చేశాను. త‌ర్వాత ప్ర‌దీప్ మ‌ద్దాలిగారు డైరెక్ట్ చేసిన స‌ర్వం శ‌క్తిమ‌యం సిరీస్‌కు కాస్ట్యూమ్ డిజైనింగ్ వ‌ర్క్‌చేశాను. ఈ వెబ్ సిరీస్ నాకు చాలా ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఓ ఫుల్ ఔట్‌డోర్ ప్రాజెక్ట్‌ని త‌క్క‌వు బ‌డ్జెట్‌..త‌క్కువ మ్యాన్ ప‌వ‌ర్‌తో ఎలా హ్యాండిల్ చేయాలి అని తెలుసుకున్నాను.

విక‌ట‌క‌వికి వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?

సర్వం శ‌క్తి మ‌యం సిరీస్‌కు ప‌ని చేయ‌టం నాకు విక‌ట‌క‌వి సిరీస్‌కు వ‌ర్క్ చేయ‌టానికి ఎంతగానో హెల్ప్ అయ్యింది. నిజానికి స‌ర్వం శ‌క్తిమ‌యం సిరీస్ త‌ర్వాత పీపుల్ మీడియా బ్యాన‌ర్ సంస్థ నిర్మించిన సిరీస్ హ‌రిక‌థ‌కు వ‌ర్క్ చేశాను. అది కూడా పీరియాడిక్ సిరీస్ 90వ ద‌శ‌కం క‌థ‌,క‌థ‌నంతో రూపొందింది. డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త్రీరోజెస్ ఫేమ్ మ్యాగీ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. దీంతో పాటు విక‌ట‌క‌వి సిరీస్‌కు వ‌ర్క్ చేసే అవ‌కాశం ఒకేసారి వ‌చ్చింది. పీరియాడిక్ సిరీస్‌ల్లో హ‌రిక‌థ ముందుగా స్టార్ట్ అయ్యింది. ఒక సిరీస్ షూట్ ఉన్న‌ప్పుడు మ‌రో సిరీస్ షూట్ లేకుండా ఉండ‌టం కూడా కాస్త క‌లిసొచ్చింది. అలాగే హ‌రిక‌థ చేసిన వ‌ర్క్ విక‌ట‌క‌వి విష‌యంలో హెల్ప్ అయ్యింద‌నే చెప్పాలి. ఇలాంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సిరీస్‌లకు వ‌ర్క్ చేయ‌టం అనేది రెగ్యుల‌ర్‌గా సాధ్యంకాదు. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు అందిపుచ్చుకోవాలంతే.

సినిమాలు వెబ్ సిరీస్‌లు.. రెండింటికి వ‌ర్క్ చేయ‌టంలో ఉన్న వ‌త్యాసం ఏంటి?

సిరీస్‌ల‌కు వ‌ర్క్ చేసే స‌మ‌యంలో బ‌డ్జెట్‌కు సంబంధించిన ప‌రిమితులుంటాయి. త‌క్కువ బ‌డ్జెట్‌లో ఎక్కువ ఔట్‌పుట్ ఎదురు చూస్తారు. అయితే సినిమాల విష‌యానికి వ‌చ్చే స‌రికి బ‌డ్జెట్ విష‌యంలో కాస్త వెసులుబాటు ఉంటుంది. సిరీస్‌ల‌కు వ‌ర్క్ చేసేట‌ప్పుడు డైరెక్ట‌ర్‌తో పాటు ఓటీటీల‌కు సంబంధించిన ఇన్‌పుట్స్ చాలానే ఉంటాయి. కానీ సినిమాల్లో మాత్రం డైరెక్ట‌రే ఫైన‌ల్ డిసిష‌న్ మేక‌ర్‌.

ఈ సిరీస్ లో మీకు చాలెంజింగ్‌గా అనిపించిందేంటి?

ఫ్యాబ్రిక్స్ విష‌యంలో చాలా కేర్ తీసుకోవాలి.. ముందు మేం అనుకున్నది వేరు. కానీ క‌థ‌కు త‌గ్గ మూడ్ ప్ర‌కారం చూస్తే ఫ్యాబ్రిక్స్‌ను మార్చాల్సి వ‌చ్చింది. హీరో లుక్ విష‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. అప్ప‌టి లుక్‌లో క‌నిపిస్తూనే పొడ‌వుగా క‌నిపించాలి.. ఇవ‌న్నీ మాకు చాలెంజింగ్‌గా అనిపించాయి. అయితే వాట‌న్నింటినీ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ క‌రెక్ట్ చేసుకుంటూ వ‌చ్చాం. మేఘా ఆకాష్‌గారికి ముందుగా చుడీదార్ అనుకున్నాం. కానీ క‌థానుగుణంగా చుడీదార్ కంటే శారీనే బాగా న‌ప్పుతుంద‌నిపించింది. అలాగ‌ని ప‌ట్టు శారీల‌ను ఉప‌యోగించ‌లేదు. కాట‌న్‌, లెనిన్‌, ఖాదీ చీరల‌నే ఉప‌యోగించాం.

ఇక ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ప్ర‌స్తుతం స‌తీష్ వేగేశ్న‌గారు ద‌ర్శ‌క‌త్వంలో హాట్ స్టార్ రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ మ‌ర్మ‌యోగి కోసం వ‌ర్క్ చేస్తున్నాను. రీసెంట్‌గానే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే మాన‌స‌చోర అనే సినిమాకు వ‌ర్క్ చేస్తున్నాను.

]]>
https://telugubell.com/interview-of-vikkatakavi-costume-designer-gayathri-devi-joshyula-html/feed/ 0 2162
ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/interesting-buzz-on-jr-ntr-neel-project-html/ https://telugubell.com/interesting-buzz-on-jr-ntr-neel-project-html/#respond Fri, 29 Nov 2024 08:32:46 +0000 https://telugubell.com/interesting-buzz-on-jr-ntr-neel-project-html/

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “దేవర” తో మంచి హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. అరవింద సమేత సినిమా తర్వాత తన నుంచి డైరెక్ట్ గా వచ్చిన చిత్రం ఇది కాగా ఈ సినిమా తర్వాత పలు సెన్సేషనల్ సినిమాలతో తాను బిజీగా ఉన్నాడు. మరి ఈ చిత్రాల్లో పాన్ ఇండియా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా ఒకటని తెలిసిందే.

దీనిపై కూడా నెక్స్ట్ లెవెల్ హైప్ ఉండగా ఈ సినిమా నుంచి రానున్న రోజుల్లో ఓ క్రేజీ ట్రీట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనితో సినిమా టైటిల్ ని అయితే మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అనౌన్స్ చేయనున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఆల్రెడీ ఈ సినిమాకి “డ్రాగన్” అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉందనే టాక్ ఉన్న సంగతి తెలిసిందే. మరి దీనినే అనౌన్స్ చేస్తారా లేక వేరే ఏమన్నా ఉంటుందా అనేది మాత్రం చూడాలి.

The post ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

]]>
https://telugubell.com/interesting-buzz-on-jr-ntr-neel-project-html/feed/ 0 2161
పుష్ప, శ్రీవల్లిల మాస్ జాతర.. అవైటెడ్ పీలింగ్స్ సాంగ్ డేట్ వచ్చేసింది | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/pushpa-2-awaited-peelings-song-release-date-is-here-html/ https://telugubell.com/pushpa-2-awaited-peelings-song-release-date-is-here-html/#respond Fri, 29 Nov 2024 07:30:02 +0000 https://telugubell.com/pushpa-2-awaited-peelings-song-release-date-is-here-html/

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న వన్ అండ్ ఓన్లీ బిగ్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న కాంబినేషన్ లో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన మాసివ్ చిత్రం “పుష్ప 2 ది రూల్” అనే చెప్పాలి.

మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఒకో సాంగ్ ఒక దాన్ని మించి మరొకటి హిట్ కాగా రీసెంట్ గా అయితే ఈ సినిమా నుంచి నాలుగో సాంగ్ క్రేజీ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. మలయాళ ఈవెంట్ లో అనౌన్స్ చేసిన ఆ పాటనే “పీలింగ్స్”.

పక్కా మలయాళ బీట్స్ లో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఈ సాంగ్ అక్కడే ఓ రేంజ్ లో జనానికి ఎక్కేసింది. దీనితో ఈ సాంగ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకి ఇపుడు సాలిడ్ ప్రోమోతో డేట్ వచ్చేసింది. దీనితో ఈ అవైటెడ్ సాంగ్ ఈ డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్టుగా తేల్చేసారు. మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The post పుష్ప, శ్రీవల్లిల మాస్ జాతర.. అవైటెడ్ పీలింగ్స్ సాంగ్ డేట్ వచ్చేసింది first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

]]>
https://telugubell.com/pushpa-2-awaited-peelings-song-release-date-is-here-html/feed/ 0 2159