అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య కారణం తన వ్యక్తిత్వ హననం అని చెప్పుకొచ్చారు. తాను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు అని అంటూనే తన గురించి చాలా తప్పుడు ప్రచారం, అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కొన్నిసార్లు మిస్ కమ్యూనికేషన్ వల్ల కూడా ఇలా జరగొచ్చు కాబట్టి తాను ఎవరిని బ్లేమ్ చేయడం లేదని ఏ డిపార్ట్మెంట్ ని బ్లేమ్ చేయడం లేదని అన్నారు. అలాగే తాను ఏ పొలిటికల్ లీడర్ ని అలాగే గవర్నమెంట్ ని కూడా బ్లేమ్ చేయడం లేదని అన్నారు. నిజానికి గవర్నమెంట్ తమతో చాలా బాగుందని ఎందుకంటే మాకు థియేటర్లకు మంచి టికెట్ రేట్ పెంచుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వంతో తమకు అంతా బానే ఉందని చెప్పుకొచ్చారు. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నేను ఇలా బిహేవ్ చేశాను అంటూ ప్రచారం చేస్తున్నారు.
Allu Arjun: ఇది ఒక యాక్సిడెంట్, ఎవరి తప్పులేదు!
నా మీద ఇలా తప్పుడు ఆరోపణలు పడేసరికి నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఒకరకంగా ఇది వ్యక్తిత్వ హననం. నేను 20 ఏళ్ల నుంచి ఎప్పుడు ఇలాంటి వ్యవహారంలో లేను నన్ను 20 ఏళ్ల నుంచి చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా? ఇలా అంటానా ఇలా మాట్లాడగలనా కానీ అలా అన్నాను అని అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. జరిగిందంతా ఏది నిజం కాదు. నా గురించి తప్పుడు సమాచారం బయటకు వెళుతోంది.. అలాగే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే నా వ్యక్తిత్వ హననం చేసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఈ సినిమా చేసి పెద్ద సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రాములు అన్ని సెలబ్రేషన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని పబ్లిక్ ఫంక్షన్ పెట్టాలనుకున్నా అవి కూడా ఆపేసి ఒక్కడినే ఇక్కడ కూర్చుని ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది ఏంటి అని ఇంట్లోనే కూర్చున్నాను.
నేను ఎక్కడికి వెళ్లలేక పోతున్నాను, ఆఫీస్ కి వెళ్ళలేకపోతున్నాను నేను సొంతగా సినిమా తీశాను. మూడేళ్లు కష్టపడిన తీసిన సినిమాని కూడా ధియేటర్ కి వెళ్లి చూడలేకపోతున్నాను. నేను నా సినిమా ధియేటర్లో ఎలా ఉందో చూడలేదు.. నేను నేర్చుకునే అతిపెద్ద ఎడ్యుకేషన్ అదే.ఎందుకంటే రాబోయే సినిమాలో ఎలా ఉండాలి అనేది నేను వీటి ద్వారానే నేర్చుకోవాలి. నేను మీకు మంచి సినిమా ఇవ్వాలంటే కచ్చితంగా నేను థియేటర్ కి వెళ్లి నేర్చుకుంటా.. ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కడినే 15 రోజులు కూర్చుని అయ్యేది అయింది. మన తప్పేమీ లేదు నేను ఉన్న చోట జరిగింది కానీ నా వల్ల జరగలేదు కానీ నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఆ రోజు జరిగిందానికి క్షమాపణలు కోరుతున్నాను అని చెప్పుకొచ్చారు.