వరల్డ్ వైడ్ గా మంచి ఫేమ్ ఉన్న పలు సెన్సేషనల్ హిట్ వెబ్ సిరీస్ లలో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యిన క్రేజీ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ కూడా ఒకటి. మరి ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ సిరీస్ మొత్తం నాలుగు సీజన్లని కంప్లీట్ చేసుకొని ఇపుడు ఐదవ సీజన్ తో ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. అయితే దాదాపు ఫైనల్ సీజన్ గానే ఈ ఐదో సీజన్ ని మేకర్స్ తీసుకొస్తుండగా గత కొన్నాళ్ల నుంచి ఈ సీజన్ షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది.
ఈ నేపథ్యంలో సీజన్ 5 రిలీజ్ ఎప్పుడు అని చాలా మందే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ ఈ అవైటెడ్ సిరీస్ సీజన్ 5 పై ఓ అప్డేట్ అయితే అందించారు. సీజన్ 5 షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యింది అని ఇపుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే సీజన్ 2025 లో వస్తున్నట్టుగా కూడా ఫిక్స్ చేశారు. దీనితో ఈ సిరీస్ ఫ్యాన్స్ కి ఫైనల్ గా ఇక గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి.
The post మొత్తానికి “స్ట్రేంజర్ థింగ్స్ 5” పై నెట్ ఫ్లిక్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.