టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మల్టీ్స్టారర్ చిత్రాల్లో దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న ‘భైరవం’ కూడా ఒకటి. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి.
అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సాలిడ్ న్యూ ఇయర్ గిఫ్ట్ అందించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ‘భైరవం’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘ఓ వెన్నెల’ అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను నూతన సంవత్సరం రోజైన జనవరి 1న రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సాంగ్‌ను జనవరి 3న రిలీజ్ చేయబోతున్నట్లు వారు ప్రకటించారు.
ఈ పాటను బెల్లంకొండ శ్రీనివాస్, అదితి శంకర్‌లపై చిత్రీకరించారు. ఈ పాటలో కోనసీమ అందాలను అద్భుతంగా చూపెట్టనున్నారు. ఇక ఈ సినిమాలో ఆనంది, వెన్నెల కిషోర్, అజయ్, సందీప్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీసత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
The post ‘భైరవం’ నుంచి న్యూ ఇయర్ ట్రీట్ ఫిక్స్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.