మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి హీరోగా వచ్చిన రీసెంట్ చిత్రం “గుంటూరు కారం” కోసం తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత మహేష్ నుంచి రిఫ్రెషింగ్ ట్రీట్ ఇచ్చిన చిత్రం మాత్రం “ముఫాసా” అని చెప్పాలి. హాలీవుడ్ నుంచి వచ్చిన ఈ భారీ చిత్రంకి సూపర్ స్టార్ మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ తో వచ్చి తెలుగులో సాలిడ్ రెస్పాన్స్ ని తన స్టామినాతో అందుకుంది.
మరి ఇలా తెలుగులోనే కాకుండా ఇపుడు ఇండియా వైడ్ గా ఈ చిత్రం మంచి వసూళ్లతో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది. దీనితో ఈ వారం రోజుల్లో ముఫాసా చిత్రం 74 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని మంచి రన్ ని కొనసాగించింది అని చెప్పాలి. మరి ఈ మిగతా రోజుల్లో ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మహేష్ తో పాటుగా సత్యదేవ్, బ్రహ్మానందం, అలీ షేకింగ్ శేషు తదితరులు ముఖ్య పాత్రలకి తమ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
The post ఇండియాలో “ముఫాసా” మొదటి వారం సాలిడ్ వసూళ్లు.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.