VenkyAnil -3 : ‘సంక్రాంతికి వస్తున్నాం’ కోసం ‘నేను పాడతా’ అంటున్న వెంకీ

  • సంక్రాంతి వస్తున్నాం నుంచి త్వరలో మూడో పాట
  • మూడో పాటకు గొంతు సవరించిన వెంకీ మామ
  • స్టేజీ మీద స్టెప్పులు ఇరగదీసిన వెంకీ

Venkatesh : వెంకటేశ్‌ హీరోగా.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి లేడి పోలీస్ గా కనిపించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు మేకర్స్. అందులో భాగంగానే ఈ సినిమాలోని ‘గోదారి గట్టుమీద రామసిలకవే గోరింటాకు ఎట్టుకున్న సందమామవే’ సాగె ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ పాటల రచయిత భాస్కరభట్ల ఈ సాంగ్ ను రచించగా భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు.

Read Also:Ration Rice Case: పేర్ని నాని భార్య గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పురోగతి..

చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఒకప్పటి సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ రమణగోగుల ఈ పాట పాడడం విశేషం. ఆయనతో పాటు మధు ప్రియా ఈ సాంగ్ పాడింది. ఈ పాటకు సాలీడ్ రెస్పాన్స్ దక్కింది. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా సంక్రాంతి స్పెషల్ గా రాబోతుంది. ఐతే, తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ప్రమోషన్ ఈవెంట్లో వెంకటేష్ తన స్టెప్పులతో అలరించారు. సినిమాలోని పాటకు హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి వెంకీ డ్యాన్స్ వేయడం నెటిజన్లను చాలా బాగా ఆకట్టుకుంటుంది.

Read Also:జనవరి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..

కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి వెంకీ మామ ఎనర్జీ అదిరిపోయిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్‌ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *