మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘లూసిఫర్2: ఎంపురాన్ (రాజు కన్నా గొప్పవాడు)’ రాబోతుంది. ఐతే, తాజాగా ఈసినిమా షూట్ పూర్తైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మోహన్‌లాల్ తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. ఇంతకీ, మోహన్ లాల్ తన పోస్ట్ లో ఏం రాశారంటే ‘సినిమా చిత్రీకరణ ముగిసింది. 14 నెలల సమయం.. ఎనిమిది రాష్ట్రాలు.. యూఎస్, యూకే, యూఏఈ సహా దాదాపు నాలుగు దేశాలు.. ఇదొక అద్భుతమైన ప్రయాణం.
ప్రతి ఫ్రేమ్‌ని ఎలివేట్ చేసే సృజనాత్మకత పృథ్వీరాజ్ సుకుమారన్ సొంతం. స్క్రీన్ ప్లేతో ఈ కథకు ప్రాణం పోసిన మురళీ గోపీ, మాపై నమ్మకం ఉంచి ఎంతోగానో సపోర్ట్ చేసిన నిర్మాతలకు ధన్యవాదాలు. నటీనటులు, టెక్నికల్ టీమ్ సమష్టి సహకారంతోనే మేము దీనిని సాధించగలిగాం. మమ్మల్ని ఎంతగానో ఆరాధించే అభిమానుల ప్రేమే.. మాపై స్ఫూర్తి పెంచింది’’ అని మోహన్ లాల్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. మరి ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో విజయం సాధిస్తోందో చూడాలి.
The post పృథ్వీరాజ్ పై ‘మోహన్ లాల్’ క్రేజీ కామెంట్స్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.