Published on Dec 26, 2024 9:58 AM IST
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ కోసం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
ముఖ్యంగా యూఎస్‌లో ‘గేమ్ ఛేంజర్’పై బజ్ పీక్స్‌లో ఉంది. ఇప్పటికే డల్లాస్ నగరంలో ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావడంతో అక్కడి ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఎంత ఆతృతగా ఉన్నారో అర్థమవుతోంది. అయితే, అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్‌ను గ్రాండ్‌గా వేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రీమియర్స్ కోసం టికెట్ బుకింగ్స్ స్టార్ట్ చేశారు. అయితే, ప్రీ-సేల్స్‌లో గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పటికే 10వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
ఈ సినిమా రిలీజ్‌కు మరో 15 రోజుల సమయం ఉండటంతో ఈ టికెట్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇక దర్శకుడు శంకర్ ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తుండగా థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరుల ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.