Game Changer Event : సర్వం సిద్ధం.. ఆరోజు వేరు, ఈరోజు వేరు.. రీసౌండ్ రావాల్సిందే!

  • గ్రాండ్ గా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా హాజరు కానున్న పవన్ కళ్యాణ్
  • భారీగా బందోబస్త్ ఏర్పాటు

Game Changer Event : బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ కలిసి ఒకే వేదిక పై కనిపించడం కొత్త కాదు. కానీ ఈరోజు ఈ ఇద్దరు వేదికను పంచుకోబోయే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. చివరగా బాబాయ్, అబ్బాయ్ కలిసి పిఠాపురం ఎన్నికల్లో ప్రచారం చేశారు. పవన్ గెలుపు కోసం పిఠాపురం వెళ్లాడు చరణ్. అదంతా పొలిటికల్ హీట్‌లో వెళ్లిపోయింది. ఫైనల్‌గా.. పవన్ గెలుపు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు.. జనసేన పార్టీ అఖండ విజయం ఆకాశాన్నంటే ఉత్సాహం ఇచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ అనే నేను.. అని పవర్ స్టార్ ప్రమాణ స్వీకారం నాడు యావత్ దేశం మార్మోగిపోయింది. ఇక ఇప్పుడు ఏపి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్.. అబ్బాయ్ కోసం వస్తుండడం ఫ్యాన్స్‌కు ఎక్కడా లేని హై ఇస్తోంది.

Read Also:Pushpa 2 : కెనడాలో ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసిన ‘పుష్ప 2’

పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ సినిమా ఈవెంట్ ఇదే. అది కూడా అబ్బాయ్ సినిమా కావడంతో.. ఈరోజు రాజమండ్రిలో జరగనున్నఈవెంట్‌ మామూలుగా ఉండదనే చెప్పాలి. ఏపి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్‌, గ్లోబల్ స్టార్ ట్యాగ్‌తో రామ్ చరణ్‌ వస్తున్న తొలి భారీ ఈవెంట్ ఇది. అందుకే.. ఈసారి బాబాయ్, అబ్బాయ్ దెబ్బకు పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ రావాల్సిందే. ఇప్పటికే ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్‌కు మెగా అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. దాదాపు లక్ష మంది అభిమానులు రానున్నారనే అంచనాతో భారీ బందోబస్తు చేశారు పోలీసులు. పది అడుగుల ఎత్తులో వేదిక నిర్మించగా.. పెద్దఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Read Also:Kubera : మరోసారి వాయిదా పడిన శేఖర్ కమ్ముల ‘కుబేర’ ?

వేదిక చుట్టుపక్కలకు ఎవరూ రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. బందోబస్తులో 400 మంది పోలీస్ అధికారులు,1200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొనున్నారు. గ్రౌండ్ సమీపంలో 20 వేల వాహనాలు పట్టేలా ఐదు పార్కింగ్ ప్రదేశాలను గుర్తించారు. వేదిక ముందు బారికేడ్లు, హైమాక్స్ లైట్ల వద్ద అభిమానులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు.. ఈ ఈవెంట్ కోసం ఉభయగోదావరి జిల్లాల మెగా అభిమానులు ఎంట్రీ పాసుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా.. ఈ ఈవెంట్ మాత్రం మెగా ఫ్యాన్స్‌కు చాలా స్పెషల్‌గా నిలవనుందనే చెప్పాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *