Ram Charan: విజయవాడలో 250 అడుగుల రామ్‌చరణ్‌ కటౌట్‌.. నేడే ఓపెన్

  • 250 అడుగుల రామ్ చరణ్ భారీ కటౌట్ నేడు ప్రారంభం
  • హాజరు కానున్న నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్
  • హెలి కాప్టర్ ద్వారా కటౌట్ పై పూలు చల్లేందుకు ఏర్పాట్లు

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఆచార్య, ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు మన తెలుగమ్మాయి అంజలి మరో కీలక పాత్ర పోషించింది. దిల్ రాజు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో విజయ వాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు మెగా అభిమానులు. గేమ్ ఛేంజర్ సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

Read Also:Constables Suicide: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల ఆత్మహత్య..

విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్‌ ఈ బిగ్గెస్ట్ కటౌట్ ను ఆవిష్కరించబోతుంది. వేడుకల్లో భాగంగా హెలికాప్టర్‌తో రామ్ చరణ్ కటౌట్‌కి పూలాభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజుతో పాటు గేమ్ ఛేంజర్ చిత్ర బృందం హాజరు కాబోతుంది. అలాగే రామ్ చరణ్ అభిమానులు భారీగా రానున్నారు. కాగా సుమారు 256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్‌ సినిమాలో రామ్ చరణ్ లుక్‌తో కటౌట్‌ ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే అతి పెద్ద కటౌట్‌ అని మెగా అభిమానులు చెబుతున్నారు. ఈ కటౌట్‌ను ఏర్పాటు చేసేందుకు సుమారు ఐదురోజుల పాటు అభిమానులు కష్టపడ్డారు. కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతులు తీసుకున్నట్లు రామ్​చరణ్‌ అభిమానులు ప్రకటించారు. కాగా తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అవుతోంది.

Read Also:Chiru Odela Project : చిరు – ఓదెల ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డే్ట్.. ఇది కదా కావాల్సింది

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *