గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సహకారం అందిస్తుందని ఆయన ఈ సందర్భంగా మరోసారి తెలిపారు. ఇక ‘గేమ్ ఛేంజర్’ మూవీ కోసం చిత్ర యూనిట్ తీవ్రంగా కష్టపడిందని.. వారికి బూస్ట్ ఇచ్చేందుకే టికెట్ రేట్లు పెంచామని.. దీని ద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ట్యాక్స్ లభిస్తుందని ఆయన తెలిపారు.
ఇక ‘గేమ్ ఛేంజర్’ మూవీ కోసం రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. ‘రంగస్థలం’ సినిమాలో చరణ్ యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయానని.. ‘మగధీర’ సినిమాలో అతడి హార్స్ రైడింగ్ చూసి స్టన్ అయ్యానని పవన్ ఈ సందర్భంగా అన్నారు. రామ్ చరణ్ ఒక సినిమా కోసం ఎంత కష్టపడతాడో తనకు తెలుసని.. అందుకే ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి ప్రేక్షకులు కూడా ఆదరణ చూపించాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. కొత్త సంవత్సరంలో ‘గేమ్ ఛేంజర్’తో బాక్సాఫీస్ బద్దలై పోవాలి అంటూ పవన్ కామెంట్ చేశారు.
The post ‘గేమ్ ఛేంజర్’తో బాక్సాఫీస్ బద్దలై పోవాలి – పవన్ కళ్యాణ్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.