‘గేమ్ ఛేంజర్’ మూడో సింగిల్ సాంగ్‌పై క్రేజీ అప్డేట్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. అయితే, ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ రిలీజ్ అవగా, వాటికి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది.

ఇక ఈ సినిమా నుండి మూడో సింగిల్ సాంగ్‌గా మెలోడీ పాటను తీసుకొస్తున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తెలిపాడు. ఈ పాట ప్రేక్షకులందరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంతో పాటు వారికి సరికొత్త అనూభూతిని కూడా ఇస్తుందని తెలిపాడు. ఈ పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను నవంబర్ 22న.. ప్రోమోని నవంబర్ 25న.. సాంగ్‌ని నవంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన తన ట్వీట్‌లో తెలిపాడు.

ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య, అంజలి, సునీల్, తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The post ‘గేమ్ ఛేంజర్’ మూడో సింగిల్ సాంగ్‌పై క్రేజీ అప్డేట్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *