మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరో రెండు వారాల్లో మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రాబోతోంది. జనవరి 10న మెగా ఫ్యాన్స్‌కు అసలు సిసలైన సంక్రాంతి స్టార్ట్ కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ నుంచి జరగండి, రా మచ్చా, నానా హైరానా, డోప్ సాంగ్స్ రిలీజ్ అవగా.. చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు.
ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ ట్రైలర్ పై సూపర్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. నూతన సంవత్సరం కానుకగా జనవరి 2న సాయంత్రం 5:04 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయమై అధికారకంగా ప్రకటిస్తూ ఈ సినిమాలోని రామ్ చరణ్ అప్పన్న క్యారక్టర్ లుక్ ను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. అప్పన్న లుక్ లో రామ్ చరణ్ అదరగొట్టాడు అనే చెప్పాలి. ఇక ఈ వారంలోనే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏపిలోని రాజమండ్రిలో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు రియల్ గేమ్ ఛేంజర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నట్టు టాక్ ఉంది. అదనుకోసం ఇటీవల దిల్ రాజు పవర్ స్టార్ ను కలిసి ఈవెంట్ కు రావాల్సిందిగా కోరారు. ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.