గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “గేమ్ ఛేంజర్”. మరి ఎప్పుడు నుంచో తెరకెక్కిస్తూ వస్తున్న ఈ సినిమా ఇప్పుడిప్పుడే మంచి హైప్ బిల్డప్ చేసుకుంటుంది. అయితే టీజర్ తర్వాత ఇంకా సరైన అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సమయంలోనే యూఎస్ లో ఫస్ట్ ఎవర్ ప్రీ రిలీజ్ అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ డిసెంబర్ 20న అక్కడ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని డల్లాస్ లో ప్లాన్ చేయగా దీనికి సుకుమార్ వస్తున్నట్టుగా కూడా తెలిపారు. అయితే ఈ ఈవెంట్ లోనే ట్రైలర్ లాంఛ్ ఉంటుంది అని ఇపుడు ఫిక్స్ అయ్యింది.
సుకుమార్ చేతుల మీదుగానే అక్కడ ట్రైలర్ ని ఆ గ్రాండ్ ఈవెంట్ లో మేకర్స్ లాంఛ్ చేయనున్నారట. దీనితో గేమ్ ఛేంజర్ మేనియా అక్కడ నుంచి స్టార్ట్ కానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది జనవరి 10న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
The post ఈ గ్రాండ్ ఈవెంట్ లోనే “గేమ్ ఛేంజర్” ట్రైలర్ ఫీస్ట్ లాక్.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.