
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ ఫలితంతో అభిమానులు నిరాశ చెందగా, సల్మాన్ మాత్రం తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. తాజాగా, అతను సంజయ్ దత్‌తో కలిసి గంగా రామ్ అనే మల్టీ స్టారర్ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు క్రిష్ అహిర్ తెరకెక్కించనున్నాడు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుందని టాక్.
సల్మాన్ ఖాన్ గతంలో సంజయ్ దత్‌తో కలిసి సాజన్, చల్ మేరే భాయ్ వంటి సినిమాల్లో నటించాడు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయడం ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్ పెంచింది. గంగా రామ్ టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నాడని, మరో నిర్మాణ సంస్థతో కలిసి ప్రొడ్యూస్ చేయనున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో, సల్మాన్, సంజయ్ దత్ ఇటీవల హాలీవుడ్ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించారని టాక్ ఉంది. ఆ సినిమా షూటింగ్ దుబాయ్‌లో జరిగిందని, త్వరలోనే అఫీషియల్ అప్‌డేట్ రానుందని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం గంగా రామ్ షూటింగ్ జూన్ లేదా జూలైలో ప్రారంభమవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్రిష్ అహిర్ గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేస్తుండటంతో, అతనికి ఈ బిగ్ ప్రాజెక్ట్ లభించింది. ఫ్యాన్స్ మాత్రం ఈ యాక్షన్ డ్రామా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.