
అలేఖ్య చిట్టి పికిల్స్ అనే పచ్చళ్ల బ్రాండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పెద్ద వివాదానికి కారణమైంది. ముగ్గురు అక్కచెల్లెళ్లు కలసి ప్రారంభించిన ఈ బిజినెస్ మొదట్లో మంచి ఆదరణ పొందినా, ఒక కస్టమర్‌తో అసభ్యంగా మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో ఒక్కసారిగా ట్రోల్స్ పెరిగాయి. ప్రత్యేకంగా అలేఖ్య చిట్టి, పికిల్స్ ధరపై ప్రశ్న అడిగిన కస్టమర్‌ను అమ్మనా బూతులు తిట్టిన ఆడియో వైరల్ అయ్యింది. ఇది సామాజిక మాధ్యమాల్లో భిన్నమైన స్పందనలకు దారితీసింది.
ఆ ఆడియోపై మొదట్లో “తప్పుగా పంపించాం” అని కవర్ చేయాలని ప్రయత్నించినా, తరువాత తప్పును అంగీకరించి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అయినా ట్రోలింగ్ ఆగలేదు. తీవ్ర ఒత్తిడికి లోనైన అలేఖ్య డిప్రెషన్‌కు గురై శ్వాస సంబంధిత సమస్యలతో హాస్పిటల్లో చేరింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆమె సోదరీమణులు షేర్ చేస్తూ “అక్కకు ఏదైనా అయితే మీరే బాధ్యులు” అని భావోద్వేగంగా స్పందించారు.
ఇదే సమయంలో కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తుండగా, మరికొందరు ఈ సిస్టర్స్‌కు మద్దతు తెలిపారు. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ఈ ఘటనపై స్పందిస్తూ మద్దతు తెలిపారు. ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ కూడా వీడియో ద్వారా వీరిని సమర్థించింది. “మగవాళ్లే కాదు, కోపంలో ఆడవాళ్లు కూడా బూతులు మాట్లాడతారు. కానీ తరువాత సారీ చెప్పటం చాలా పెద్ద విషయం” అంటూ గీతూ మాట్లాడింది.
ఈ వివాదం ఒక చిన్న వ్యాపారం నుంచి పెద్ద చర్చకు దారి తీసింది. మనుషులవల్ల తప్పులు జరుగుతాయి. కానీ వాటి నుండి నేర్చుకొని మారడం ముఖ్యం. ఈ సంఘటన పచ్చళ్లకే కాదు, online business ethics గురించీ మంచి పాఠమే అయ్యింది.