టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడెక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా గతంలో జల్సా, బాద్ షా సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేశ్ బాబు ఈ సారి ఓ ఇంగ్లీష్ సినిమా కోసం వాయిస్ ఓవర్ అందించాడు. హాలీవుడ్ లో తెరకెక్కిన ముఫాసా ది లయన్ కింగ్ లో సింహానికి మహేశ్ బాబు డబ్బింగ్ చెప్పారు.
ఈ సినిమా ఈ నెల 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తెలుగు రాష్టాల్లో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. తమ హీరో వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమా కావడంతో అటు మహేశ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను తమ సొంత సినిమాగా భావించి ముఫాసా రిలీజ్ కోసం , ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఇప్పటివరకు లేని సరికొత్త రికార్డును క్రియేట్ చేసారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు చూస్తుంటాం. కానీ మొట్ట మొదటి సారి హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ వాల్ట్ డిస్నీ నుంచి వస్తున్న ముఫాసా – ది లయన్ కింగ్’ కు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ 35MM సినిమాను 20 తేదీ ఉదయం 8.00 గంటలకు ప్రీమియర్ ప్రదర్శిస్తున్నారు. ప్రీమియర్ వేయడం ఒకెత్తు అయితే అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నిమిషాల వ్యవధిలో హౌస్ ఫుల్ అవడం మరొక ఎత్తు అనే చెప్పాలి.