ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అభిమానులు సహా పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ని ఉన్న తక్కువ సమయంలో కూడా నేషనల్ వైడ్ గా చేస్తున్నారు. మరి ఇలా హిందీలో కూడా సాలిడ్ ప్రమోషన్స్ తో మేకర్స్ వెళుతున్నారు.
లేటెస్ట్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ లోకి వెళ్లి సందడి చేశారు. మరి చరణ్, సహా కియారా బిగ్ బాస్ స్టేజి మీదకి వెళ్లడమే కాకుండా అక్కడ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్స్ తో పలు టాస్క్ లు కూడా చేయించారు. ఇక సల్మాన్ తో చరణ్ కి ఉన్న బాండింగ్ కోసం తెలిసిందే. చరణ్ తో మాట్లాడుతూ సల్మాన్ తనని ఉపాసనని తమ ఇంటికి రావాలని కూడా ఆహ్వానించారు. దీనితో ఈ ఎపిసోడ్ తాలూకా విజువల్స్ వైరల్ గా మారాయి.
The Real Bhai @BeingSalmanKhan certified blockbuster #GameChanger ???????????? pic.twitter.com/g05mZqVVvS
— Beyond Media (@beyondmediapres) January 5, 2025
The post భాయ్ షోలో గ్లోబల్ స్టార్.. కియారాతో కలిసి ‘బిగ్ బాస్’లో సందడి! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.