- మోస్ట్ సెర్చెడ్ సినిమాల లిస్ట్ రిలీజ్ చేసిన గూగుల్
- సలార్, కల్కిలతో సత్తా చాటిన డార్లింగ్
- ఐదో స్థానంలో హనుమాన్
ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుండి ఈ ఏడాది ఎన్నో సినిమాలొచ్చాయి. కొన్ని హిట్స్ అందుకుంటే.. మరికొన్ని డిజాస్టర్స్‌గా నిలిచాయి. కొన్ని క్యూరియాసిటీకి తగ్గట్లుగా హిట్స్ కొట్టాయి. అలాగే ఏ మాత్రం ఎక్స్ పర్టేషన్స్ లేకుండా వచ్చి సరికొత్త రికార్డులు సృష్టించాయి. కల్కి 2898ఏడీతో పాటు మంజుమ్మల్ బాయ్స్ లాంటి పిక్చర్సే అందుకు ఎగ్జాంపుల్స్. ఇక సినిమా పరంగానే కాదు సోషల్ మీడియా పరంగా కూడా మోస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి కొన్ని సినిమాలు.
Also Read : Maharaja : చైనాలో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్న’మహారాజా’
ఈ ఏడాది తెగ వెతికేసిన సినిమాల జాబితాను గూగుల్ లో రిలీజ్ చేసింది. ఇందులో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన బాలీవుడ్ హారర్ మూవీ స్త్రీ 2 ఫస్ట్ ప్లేసులో నిలిచింది. ఆ తర్వాత డార్లింగ్ కల్కి నిలిచింది. ఇలా సాహో జోడి శ్రద్ధా, ప్రభాస్ సెర్చింజన్‌లో సత్తా చాటారు. నెక్ట్స్ 3,4 స్థానాలను నార్త్ బెల్ట్ మూవీస్ 12th ఫెయిల్, లపటాలేడీస్ తీసుకున్నాయి. 5వ స్థానంలో మళ్లీ తెలుగు సినిమా హవా చూపింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ ఫిప్త్ బెంచ్ తీసుకుంది. ఆరు, ఏడు స్థానాలను తమిళ్, మలయాళ ఇండస్ట్రీలు పంచుకున్నాయి. మక్కల్ సెల్వన్ మహారాజాతో పాటు ఇప్పటి వరకు కేరళలోనే హయ్యెస్ట్ కలెక్షన్ మూవీగా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ గూగుల్ టాప్ 10 సెర్చింగ్ సినిమాల్లో చోటు దక్కించుకుంది. 8, 9, 10 స్థానాలను కూడా సౌత్ బొమ్మలే ఆక్యుపై చేశాయి. విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం, సలార్, ఫహాద్ ఫజిల్ ఆవేశం ఆ ప్లేసులను వరుసగా తీసుకున్నాయి. దీన్ని బట్టి చూస్తే గూగుల్లో కూడా సౌత్ సినిమాల హవానే కనబడుతోందనమాట.