మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో ఆకట్టుకునే హీరో గోపీచంద్. ఈ జానర్ లో ఆయన చేసిన లేటెస్ట్ మూవీ “భీమా”. గత నెల 8న మహా శివరాత్రి సందర్భంగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. మాస్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే మూవీ లవర్స్ “భీమా”ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రేక్షకుల్ని ఎంకరేజ్ చేసేందుకు హీరో గోపీచంద్ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు.

‘మ్యాజిక్ ఆఫ్ భీమా మీ స్క్రీన్స్ మీదకు వచ్చేసింది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ అవుతోంది. మీరంతా తప్పక చూడండి’ అని ఆయన అన్నారు. “భీమా” సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు. దర్శకుడు ఎ హర్ష రూపొందించారు. ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. థియేటర్స్ లో మాస్ ఆడియెన్స్ బాగా ఆకట్టుకున్న “భీమా” సినిమాకు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.