చియాన్ విక్రమ్ (Chiyaan vikram) నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్” (Thangalaan) ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. రేపు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. “తంగలాన్” ట్రైలర్ పై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్ తో విక్రమ్ సర్ ప్రైజ్ చేశారు. విక్రమ్ ను గుర్తుపట్టలేనంతగా సినిమా కోసం మారిపోయారు. ట్రైలర్ మరింతగా ఆకట్టుకోనుంది. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ తో “తంగలాన్” విడుదలపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

“తంగలాన్” చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ (Pa ranjith) రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ (Studio green films) బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా (KE Jnanavel raja) నిర్మిస్తున్నారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ (Malvika mohanan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. చారిత్రక యదార్థ ఘటన నేపథ్యంతో తెరకెక్కిన “తంగలాన్” సినిమా త్వరలోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.