Published on Dec 3, 2024 8:00 PM IST
టాలీవుడ్‌లో ‘జెర్సీ’ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఆ సినిమాలో నాని నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక గౌతమ్ ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో VD12 చిత్రాన్ని తెరకెక్కి్స్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
అయితే, ఈ సినిమాతో పాటు ‘మ్యాజిక్’ అనే మరో చిత్రాన్ని కూడా పూర్తి చేశాడు గౌతమ్. సారా అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. కానీ, ఇప్పటివరకు ఈ సినిమా ప్రమోషన్స్ లేకపోవడం.. సినిమాకు సంబంధించి అప్డేట్స్ కూడా ఏమీ రాకపోవడంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తారనే టాక్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
డిసెంబర్ 21న కాకుండా మ్యాజిక్ చిత్రాన్ని 2025లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నిజంగానే వాయిదా పడనుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.