
సినీ ఇండస్ట్రీలో ఇటీవలి కాలంలో వివాహాలు, విడాకుల వార్తలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. హిందీ, తెలుగు, తమిళ్ చిత్ర పరిశ్రమల నుంచి అనేక స్టార్ కపుల్స్ తమ విడాకుల గురించి అధికారికంగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. కొంతమంది కొత్తగా పెళ్లైన జంటలు విడిపోయినా, మరికొందరు 15-20 ఏళ్ల అనుబంధాన్ని ముగించారు. ఈ క్రమంలో సంగీత దర్శకుడు, నటుడు జీవి ప్రకాష్ – సైంధవి విడాకులు హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ విడాకుల వెనుక హీరోయిన్ దివ్య భారతి కారణమని గాసిప్ వైరల్ అయింది. తమిళ్ మూవీ Bachelor లో జీవి ప్రకాష్, దివ్య భారతి జోడీగా నటించగా, అందులో ఉన్న రొమాంటిక్ సీన్స్ కారణంగా వారి మధ్య అఫైర్ ఉందని ప్రచారం జరిగింది. అలాగే త్వరలో విడుదల కానున్న Kingsten సినిమాలోనూ వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీవి ప్రకాష్ భార్యను వదిలేశాడని నెటిజన్లు దివ్య భారతిని ట్రోల్ చేస్తున్నారు.
ఈ వివాదంపై దివ్య భారతి ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. తన వల్ల జీవి ప్రకాష్ విడాకులు తీసుకున్నాడనే ఆరోపణలను ఖండించింది. సోషల్ మీడియాలో తాను ఎదుర్కొంటున్న విమర్శలు అసత్యమని, తన కెరీర్‌పై దృష్టి పెడతానని స్పష్టం చేసింది.
ప్రస్తుతం Kingsten ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత హైప్ తెచ్చిపెడుతోంది. ఇక నిజంగా ఈ గాసిప్స్ లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి.