Hard Drive with Prabhas Action Scenes Missing
Hard Drive with Prabhas Action Scenes Missing

మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుకుంది. మోహన్ బాబు నిర్మాణంలో, ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ మూవీ దేశవ్యాప్తంగా ఆకర్షణగా మారింది. ఇందులో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్యా రాజేష్, శరత్ కుమార్ లాంటి టాప్ స్టార్స్ నటిస్తుండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ వార్త ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ప్రభాస్ యాక్షన్ సీన్స్ ఉన్న ముఖ్యమైన హార్డ్ డ్రైవ్ మాయమైందట. ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి పంపిన ఈ డ్రైవ్‌ను మే 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకుని, తర్వాత అది చరిత అనే మహిళకు అప్పగించినట్లు సమాచారం. అప్పటి నుంచి ఇద్దరూ అదృశ్యమయ్యారు.

ఈ డ్రైవ్‌లో ప్రభాస్ ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో, అవి లీక్ అయ్యే ప్రమాదం ఉందని చిత్ర బృందం ఆందోళన చెందుతోంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రెడ్డి విజయ్ కుమార్ ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటన వల్ల సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే విడుదల తేదీ వాయిదాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో ఇది పెద్ద దెబ్బగా మారిందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *