సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడికి గట్టి కౌంటర్ ఇచ్చారు డైరెక్టర్ హరీశ్ శంకర్. ఓ యూట్యూబ్ ఛానెల్ లో హరీశ్ శంకర్ గురించి ఛోటా కె నాయుడు చులకనగా మాట్లాడాడు. ఆ వీడియోను కోట్ చేస్తూ హరీశ్ శంకర్ ఓ ప్రకటన పోస్ట్ చేశారు. అందులో ఛోటా కె నాయుడుతో కలిసి గబ్బర్ సింగ్ సినిమా చేశానని, ఆ తర్వాత రామయ్య వస్తావయ్యకు కూడా కలిసి పనిచేశానని హరీశ్ శంకర్ పేర్కొన్నారు.

అయితే రామయ్య వస్తావయ్య సినిమా టైమ్ లో ఛోటా కె నాయుడును తీసేయాలనే చర్చ వచ్చినప్పుడు దర్శకుడు అది సరికాదని భావించానని, సక్సెస్ వచ్చాక హరీశ్ మారిపోయాడని ఇండస్ట్రీలో అనుకుంటారని హరీశ్ గుర్తుచేశాడు. ఛోటాను ఏరోజూ తాను కించపరిచేలా మాట్లాడలేదని, ఆయన మాత్రం పలుమార్లు యూట్యూబ్ ఛానెల్స్ లో తక్కువ చేసి మాట్లాడుతున్నారని, ఇలాంటి కెలుక్కోవడాలు ఆపాలని హరీశ్ కౌంటర్ ఇచ్చారు. హరీశ్ శంకర్ గురించి ఛోటా కె నాయుడు మాట్లాడిన యూట్యూబ్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.