పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు పాలిటిక్స్ లో ఎలాంటి బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. దీనితో తాను స్టార్ట్ చేసిన సినిమాలు ప్రస్తుతానికి పెండింగ్ లో పడ్డాయి. మరి ఉన్న గ్యాప్ లోనే పవన్ సినిమాలకి డేట్స్ ఇస్తూ కొంచెం కొంచెం కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాల్లో హరిహర వీరమల్లు అలాగే ఓజి సినిమాలు ప్రధానంగా అందరి ఫోకస్ ఉంది కానీ వీటితో పాటుగా పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా సెపరేట్ క్రేజ్ ని సెట్ చేసుకుంది.
యంగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ చిత్రం మరింత సైలెంట్ గా ఉంది. దీనితో ఆ మధ్య చాలా పుకార్లు కూడా వచ్చాయి కానీ వాటిని మేకర్స్ కొట్టి పారేసారు. అయితే లేటెస్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ పై దర్శకుడు రియాక్ట్ అవ్వడం జరిగింది.
ఎలాంటి అప్డేట్స్ లేవు కనీసం ఈ కొత్త ఏడాది గిఫ్ట్ గా అయినా ఏదొక ట్రీట్ కోసం అడుగుతున్నా ఫ్యాన్స్ కి ఖచ్చితంగా మీరు వెయిట్ చేసే సమయం వర్త్ అంటూ సమాధానం ఇచ్చారు. దీనితో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కొంచెం సమయం తీసుకున్నా కూడా అదరగొడుతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు
Happy Birthday Brother ….
Its worth waiting ???????????????? https://t.co/QBgQYpGUGj
— Harish Shankar .S (@harish2you) December 24, 2024
The post “ఉస్తాద్ భగత్ సింగ్”పై దర్శకుడు లేటెస్ట్ రియాక్షన్.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.