పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు సగ భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హరిహర వీరమల్లు పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది. ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్ లో కూడా ఈ మధ్య పాల్గొన్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది, కేవలం ఎనిమిది రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా వారికి మొన్ననే గుడ్ న్యూస్ తెలిపారు మేకర్స్. నూతన సంవత్సరం కానుకగా హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ప్రకటించారు.
Pani Puri: “పవర్ ఆఫ్ పానీపూరీ”.. ఏడాదిలో రూ. 40 లక్షల చెల్లింపులు.. జీఎస్టీ నోటీసులు..
హరిహర వీరమల్లు లోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ న మేకర్స్ ఫైనల్ గా వెల్లడించారు. జవన్ 6న స్వయంగా పవర్ స్టార్ ఆలపించిన మాట వినాలి అనే సాంగ్ ను ఉదయం 9 గంటల 6 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు పవన్ పోస్టర్ ఒకదాన్ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుస్తుండగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాని ఈ ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్.