UnstoppableS4 : అన్ స్టాపబుల్ సంక్రాంతి హీరోలు ప్రోమో సూపర్బ్

అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ వేదికపై మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో సూర్య సందడి చేసారు. అలాగే ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా విచ్చేసి ఎన్నో విషయాలు బాలయ్యతో పంచుకున్నారు. బన్ని ఎపిసోడ్ మిలియన్ వ్యూస్ తో రికార్డు సాధించింది. ఇక లేటెస్ట్ గా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, డాన్సింగ్ డాల్ శ్రీలీల అన్ స్టాపబుల్ సెట్స్ లో నవ్వులు పువ్వులు పూయించారు.

ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ పాల్గొన్నారు.  ప్రస్తుతం వెంకీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా వెంకీ అన్ స్టాపబుల్ సెట్స్ లో  చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి హాజరయ్యాడు. కొద్ది సేపటి క్రితం సంక్రాంతి హీరోల పేరుతో ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు మేకర్స్. అతిధిగా విచ్చేసిన వెంకటేష్ ను ఆత్మీయంగా ఆహ్వానించిన బాలయ్య ‘  మనం ఒకరికొకరం పోటీ ఆ’ అని ప్రశించగా ఎక్కడమ్మా పోటీ అని వెంకీ మాం బదులిచ్చారు. అలాగే ఈ ఎపిసోడ్ లో వెంకటేష్ అన్నయ్య, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా పాలొన్నారు. వారిరువురి చిన్ననాటి విషయాలను బాలయ్య తో సరదాగా పంచుకున్నాడు. ప్రోమో ఆద్యంతం నవ్వులతో సరదా సంభాషణలతో స్పెషల్ గా ఉందనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ ను ఈ నెల 27 న రాత్రి 7:00 గంటలకు స్ట్రీమింగ్ కు తీసుకురానుంది ఆహా.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *