Published on Dec 1, 2024 5:00 PM IST
బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో సుమన్ వూట్కూరు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సందేహం’. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై సత్యనారాయణ పర్చా నిర్మాతగా లవ్ అండ్ ఎంగేజ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్‌గానే ఈటీవీ విన్‌లోకి సందేహం వచ్చింది. ఓటీటీలోనూ సందేహం సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది.
హెబ్బా పటేల్ నటనకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వారం రిలీజ్ అయిన చిత్రాల్లోకెల్లా సందేహం అందరినీ ఆకట్టుకుని ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్ని పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉండటం విశేషం. ఈ మూవీకి ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ, వెంకట ప్రభు ఎడిటింగ్ మేజర్ అట్రాక్షన్‌గా నిలిచాయి. సుభాష్ ఆనంద్ సంగీతం ఆడియెన్స్‌ను మెప్పించింది.