Ram Charan Cut-Out Launch: రామ్ చరణ్ రికార్డు బ్రేకింగ్ కటౌట్ కి హెలికాప్టర్ పూలాభిషేకం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని రామ్ చరణ్ కటౌట్ ఒకదాన్ని విజయవాడలో లాంచ్ చేశారు.

Pa.Pa: జ‌న‌వ‌రి 3న ‘పా.. పా..’ మూవీ

విజయవాడకి చెందిన రామ్ చరణ్ యువశక్తీ అభిమానులు ఇండియాలో ఏ హీరోకి లేని విధంగా 256 అడుగుల భారీ కట్ అవుట్ ని విజయవాడలోనే ఏర్పాటు చేశారు. ఈ రోజు అభిమానులు హెలికాప్టర్ చేత ఆ కట్ అవుట్ పై పూల వర్షాన్ని కురిపించే ప్రోగ్రాం ఏర్పాటు చేయగా, నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన రాగానే అభిమానులు హెలికాప్టర్ నుంచి చరణ్ కట్ అవుట్ పై పూల వర్షాన్ని కురిపించారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *