“గం..గం..గణేశా” సినిమాను త్వరలోనే రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు హీరో ఆనంద్ దేవరకొండ. ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఈ క్రైమ్ డ్రామా సినిమా కోసం రెండే‌ళ్లుగా కష్టపడుతున్నామని, సినిమా మేకింగ్ లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు అంతా బాగుందని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.

ప్రేక్షకులందరికీ “గం..గం..గణేశా” సినిమా నచ్చుతుందని, ఈ సినిమాను కొత్త పద్ధతిలో దర్శకుడు తెరకెక్కించాడని ఆనంద్ దేవరకొండ తెలిపారు. ఈ సినిమా స్మాల్ ఫిల్మ్ విత్ బిగ్ హార్ట్ అని ఆయన అన్నారు. “గం..గం..గణేశా” సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటిస్తోంది.