Kiccha Sudeep: సప్పుడు లేకుండా తెలుగులోకి కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’.. రిలీజ్ ఎప్పుడంటే?

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మ్యాక్స్’. వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటించారు. వి క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై తమిళ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 27న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ‘మ్యాక్స్’లో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు.

Prabhas: ఫ్యాన్స్ కు ప్రభాస్ సారీ.. వీడియో రిలీజ్

ఆల్రెడీ విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. తెలుగులో సుదీప్ అభిమానులు, ప్రేక్షకులు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కిచ్చా సుదీప్, వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్, తదితరులు నటించిన ఈ సినిమాకి శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ ఎస్ఆర్ గణేష్ బాబు ఎడిటింగ్ అందించారు. ఇక అశ్లేషా డైలాగ్స్ రాసిన ఈ సినిమాకి గోసాల రాంబాబు లిరిక్స్, అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించారు. అయితే మరో పదిరోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రంగంలోకి దించడం గమనార్హం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *