Published on Jan 5, 2025 2:05 PM IST
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రచారంలో ఉంది. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణీ వసంత్‌ను ఫిక్స్ చేసినట్లు ఆ మధ్య బాగా వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నిజంగానే రుక్మిణీ వసంత్‌ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారని.. ఆమె ఇప్పటికే ఈ సినిమా కోసం తన లుక్ పై కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది.
ఇక విదేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకొని హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్ ఈ మూవీ కోసం నెలాఖరున కర్ణాటక వెళ్తారని తెలుస్తోంది. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్’ సినిమా గురించి నిత్యం ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. అన్నట్టు సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అటు హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ నటిస్తున్న వార్-2 సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది.