హీరోయిన్ తాప్సీ వెడ్డింగ్ లైఫ్ లోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు మాథ్యూస్ బోతోను ఆమె పెళ్లి చేసుకుంది. గత నెల 20న వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగగా…23వ తేదీన రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో వివాహం చేసుకున్నారు. తాప్సీ పెళ్లి వీడియో క్లిప్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు కంగ్రాట్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

తన పెల్లి రోజున తాప్సీ డ్యాన్సులు చేస్తూ సందడి చేసింది. మాథ్యూస్ బోతో డెన్మార్క్ కు చెందిన బ్యాట్మింటన్ ప్లేయర్. ఇప్పుడు కోచ్ గా పనిచేస్తున్నారు. దాదాపు పదేళ్లుగా తాప్సీ బోతో లవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ హీరోయిన్ ఇంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.