స్వాతిముత్యం, ఊరు పేరు భైరవకోన వంటి చిత్రాలతో యంగ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్ష బొల్లమ్మ. పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు దక్కకున్నా సర్ ప్రైజింగ్ ఆఫర్స్ మాత్రం ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ క్రేజీ ఆఫర్ వర్ష బొల్లమ్మకు దక్కినట్లు తెలుస్తోంది. నితిన్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ వేణు రూపొందిస్తున్న తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా ఈమెను ఎంచుకున్నారట.

ఇప్పటిదాకా ఈ సినిమాలో హీరోయిన్ గా కాంతార ఫేమ్ సప్తమి గౌడ పేరు వినిపించింది. అయితే వర్ష బొల్లమ్మనే హీరోయిన్ గా ఫైనల్ గా కన్ఫర్మ్ చేసుకున్నారట మూవీ టీమ్. తమ్ముడు సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. నితిన్ అక్కగా లయ కనిపించనుంది. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తో తమ్ముడు సినిమా తెరకెక్కుతోంది.