
ప్రస్తుతం ఓటీటీలో ఒక చిన్న వెబ్ సిరీస్ దుమ్మురేపుతోంది. పెద్ద స్టార్ హీరోలు లేదా భారీ బడ్జెట్ లేకపోయినా, ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. దీనికి కారణం ప్రత్యేకమైన కథనం మరియు యథార్థ ప్రతిబింబం. ఈ సిరీస్ పేరు ఆస్పిరెంట్స్. ఇది “ది వైరల్ ఫీవర్” అనే ప్రముఖ వెబ్ సిరీస్ నిర్మాణ సంస్థ రూపొందించినది. ఈ సిరీస్ ప్రతి యువతకి ముఖ్యమైన సందేశాలను అందిస్తోంది.
ఈ సిరీస్లో UPSC పరీక్షలకు సిద్ధమవుతున్న నలుగురు స్నేహితుల జీవితాలు, వారి పోరాటాలు, స్నేహం, విడిపోవడం వంటి అంశాలను ఆసక్తికరంగా చూపించారు. నవీన్ కస్తూరియా, నమితా దుబే, సన్నీ హిందూజా, శివనిక్త్ సింగ్ పరిహార్ నటన చాలా మెప్పించింది. ఈ సిరీస్ IMDBలో 9.2 రేటింగ్ పొందింది. 2012లో ఢిల్లీలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో జరిగిన సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ సిరీస్ వాస్తవత్వాన్ని బాగా ప్రతిబింబిస్తుంది.
ఇప్పటి వరకు రెండు సీజన్లు పూర్తయిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి. మూడో సీజన్ కోసం ప్రేక్షకులు భారీగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సీజీస్ మూడో భాగం కూడా విడుదల కానుంది. కొత్త సీజన్లో నలుగురు స్నేహితులు ఎదుర్కొనే సమస్యలు, మలుపులు, వారి మధ్య తిరిగి కలవడం వంటి అంశాలు ఉంచబడ్డాయి.
ఈ సిరీస్ యువతా ప్రేక్షకులకి ఒక గొప్ప గైడ్ లాంటి సిరీస్. విద్యార్థులు, యువత ప్రత్యేకించి దీన్ని తప్పకుండా చూడాలి.