డిఫరెంట్ మూవీస్ చేస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు యంగ్ హీరో సుహాస్. దీంతో ఆయన రేంజ్ కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3న రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుండగా..కన్నడలో హోంబలే ఫిలింస్ రిలీజ్ చేస్తోంది. కేజీఎఫ్, సలార్ వంటి భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా ఉన్న హోంబలే ఫిలింస్ సుహాస్ సినిమాను రిలీజ్ చేయడం అంటే ఆ సినిమాకు ఎంతో అడ్వాంటేజ్ అనుకోవచ్చు.

సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ప్రసన్న వదనం సినిమాను తెరకెక్కించారు దర్శకుడు అర్జున్. ఈ చిత్రాన్ని మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ ఇట్రెస్టింగ్ గా ఉండి మూవీ మీద ఆసక్తిని పెంచుతోంది. మనుషుల ముఖాలను మాత్రం మర్చిపోయే ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ తో ప్రసన్నవదనం సినిమా రూపొందింది.