
ఆహా ఓటీటీ నుంచి మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ హోమ్ టౌన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మన ఇంటి పరిసరాల్లో ఉన్న బంధాలు, జ్ఞాపకాల నేపథ్యంలో రూపొందించిన ఈ సిరీస్, ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్‌కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు.
ఈరోజు హోమ్ టౌన్ వెబ్ సిరీస్ టీజర్ విడుదల అయింది. 2000 సంవత్సరంలో, ఇంటర్నెట్ పూర్తిగా అందుబాటులోకి రాకముందు, ఓ అందమైన గ్రామాన్ని నేపథ్యంలో ఉంచుకుని కథ సాగుతుంది. స్కూల్ లైఫ్, మొదటి ప్రేమలు, స్నేహితులతో గడిపిన ఆనందక్షణాలు ఈ సిరీస్‌లో హైలైట్ కానున్నాయి. టీజర్ చూస్తే ఈ కథ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.
ఈ వెబ్ సిరీస్‌ను నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించగా, సినిమాటోగ్రాఫర్ దేవ్ దీప్ గాంధీ కుండు మరియు సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి ఈ ప్రాజెక్ట్‌కు పని చేశారు. హోమ్ టౌన్ వెబ్ సిరీస్ కుటుంబ అనుబంధాలను, స్నేహితుల మధ్య బంధాన్ని, నాటి రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఉండనుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఏప్రిల్ 4 నుంచి ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్, 90’s కిడ్స్, మిలేనియల్స్ అందరికీ నోస్టాల్జియా ఫీలింగ్ తెప్పించనుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం ఆహా అధికారిక సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి.