
పాయల్ రాజ్‌పుత్ 1992 డిసెంబర్ 5న ఢిల్లీ లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు విమల్ కుమార్ రాజ్‌పుత్ మరియు నిర్మల్ రాజ్‌పుత్. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో acting diploma పూర్తి చేసి, ప్రముఖ కాలేజీ నుండి graduation పూర్తిచేసుకుంది.
కెరీర్ ప్రారంభంలో Hindi TV Serials (హిందీ టీవీ సీరియల్స్) లో నటించింది. 2010లో ‘సప్నోన్ సే భరే నైనా’ ద్వారా చిన్న తెరలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ‘ఆఖిర్ బహు భీ తో బేటీ హీ హై’, ‘గుస్తాఖ్ దిల్’, ‘మహాకుంభ్’ వంటి సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
2017లో పంజాబీ సినిమా ‘చన్నా మేరేయా’ లో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. 2018లో ‘వీరే కి వెడ్డింగ్’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అదే ఏడాది ‘RX100’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి భారీ క్రేజ్ సంపాదించింది.
తర్వాత ‘వెంకీ మామ’ సినిమాతో వెంకటేష్ సరసన నటించింది. 2023లో ‘మంగళవారం’ చిత్రంతో ఆకట్టుకున్న పాయల్, ప్రస్తుతం ‘వెంకటలచ్చిమి’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. పాయల్ రాజ్‌పుత్ కెరీర్ అంచెలంచెలుగా ఎదుగుతూ, ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటూ వెండితెరను మెరిపిస్తోంది.