టాలీవుడ్ స్టార్ కమెడియన్ రచ్చ రవి కెరీర్ ఎంతో ప్రేరణదాయకంగా ఉంది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్, మిమిక్రీపై ఆసక్తి ఉండటంతో టీవీ షోల ద్వారా తన టాలెంట్ చూపించాడు.
అయితే, సినీరంగంలో అవకాశం రాకపోవడంతో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగం చేసాడు. ఆ తర్వాత స్మితా సబర్వాల్ మేడం దగ్గర కూడా పనిచేశాడు. కానీ తన అభిరుచికి దూరంగా ఉండలేక ఉద్యోగానికి రాజీనామా చేసి దుబాయ్ వెళ్లి రేడియో జాకీగా పని చేశాడు.
హైదరాబాద్ తిరిగి వచ్చాక జబర్దస్త్ కామెడీ షోలో అడుగుపెట్టి, అక్కడ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ తో సూపర్ ఫేమస్ అయ్యాడు. “రెండు నిమిషాలు ఆగుతావా?” అనే డైలాగ్ వైరల్ అయ్యింది. ఇందితో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, భీమా, గద్దలకొండ గణేష్, భీమ్ భుష్, బలగం వంటి హిట్ చిత్రాల్లో తన కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్వించాడు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ కమెడియన్‌గా మారిన రవి, త్వరలోనే ఇంకా పెద్ద అవకాశాలు అందుకుంటాడని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ యాస, నటన, మిమిక్రీ కలిసి రచ్చ రవిని ఒక ప్రత్యేకమైన కమెడియన్‌గా నిలిపాయి. హాస్యం, టాలెంట్ కలిగిన ఈ స్టార్, త్వరలో ఇంకా పెద్ద సినిమాల్లో కనిపించనున్నాడని ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు.